Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

త్వరలో 11 అంకెల ఫోన్ నంబర్


ఇప్పటివరకు మనదేశంలో సెల్ వాడుతున్న అందరి నెంబర్‌లో 10 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. అయితే త్వరలో 11 అంకెలున్న ఫోన్ నంబర్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, 2050 నాటికి ఇండియాలో మొబైల్ నంబర్లకు ఏర్పడే డిమాండ్‌ను అనుసరించి, 11 అంకెలను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.

 

10 అంకెల నంబర్లతో 250 కోట్ల మందికి సేవలందించే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. అంతకు మించి మొబైల్ నంబర్లు కావాలంటే, 11 అంకెలు కావాల్సిందే. ఇప్పటికే భారత టెలికం నియంత్రణ సంస్థ 11 అంకెలను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మరో 30 సంవత్సరాల తరువాత ఏర్పడే డిమాండ్‌కు అనుగుణంగా ఓ అంకెను పెంచాలన్న నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

Advertisements
error: నమస్కారం!