Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

Aditya L1 Mission : ఇస్రో తర్వాత టార్గెట్ సూర్యుడే .. ఆదిత్య మిషన్ రెడీ

చంద్రయాన్-2 పూర్తిస్థాయిలో సక్సెస్ అవ్వకపోయినా నిరాశ చెందకుండా తర్వాత ప్రయోగానికి రెడీ అయిపోతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఆ ప్రాజెక్టు పేరే ఆదిత్య-L1. వచ్చే సంవత్సరం దీని ప్రయోగం జరగబోతోంది. మనందరికీ కనిపించే సూర్యుడి ఉపరితలంపై 6వేల డిగ్రీల వేడి ఉంటుందని మనకు తెలుసు. సూర్యుడి మధ్యలో 11వేల డిగ్రీల వేడి ఉంటుందని కూడా తెలుసు. అయితే సూర్యుడిపై అక్కడక్కడా మచ్చలున్నాయి. వాటిలో కొన్ని భూమి కంటే చాలా పెద్దవి. అవి ఎందుకున్నాయి? అక్కడ ఎందుకు మంట లేదు? అని తెలుసుకోవటానికి ఇస్రో 2020లో సూర్యుడి చెంతకు రాకెట్‌ను పంపబోతోంది.

 

ఇందులో 400 కేజీల ఆదిత్య-L1 అనే శాటిలైట్ ఉంటుంది. భూమి నుంచీ 15 లక్షల కిలోమీటర్ల దూరంలో హాలో కక్ష్యలో శాటిలైట్‌ను ఉంచబోతోంది ఇస్రో. ఆ కక్ష్యలో ఉంచడం వల్ల అది సూర్యుణ్ని నిరంతరం గమనిస్తూ ఉండగలదు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వంటివి ఏవి వచ్చినా ఆ సమయంలో కూడా ఆ శాటిలైట్ సూర్యుణ్ని చూడగలదు. శాటిలైట్ ప్రధాన లక్ష్యం సూర్యుడి బాహ్య పొర (కొరొనా)ని పరిశోధించడం. అసలు కొరొనా ఎందుకు అంత వేడిగా ఉంటోంది అన్న విషయాన్ని ఇస్రో.

 

ఈ శాటిలైట్ ద్వారా తెలుసుకోవాలనుకుంటోంది. మొత్తంగా ఆదిత్య-L1 ద్వారా సూర్యుడికి సంబంధించి ఇప్పటివరకూ తెలియని కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఇస్రో ప్రయత్నిస్తోందన్నది స్పష్టమైన విషయం. ఆదిత్యను ఎప్పుడు ప్రయోగించేదీ త్వరలో తేదీ ప్రకటించనుంది. ఇది సక్సెస్ అయిన తర్వాత సూర్యుడిపై భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చెయ్యనుంది.

Read More
error: నమస్కారం!