Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

పేపర్ లీక్ కాకపోతే రహస్య విచారణలు, సమీక్షలు ఎందుకు పెడుతున్నారో చెప్పగలవా? : బుద్దా వెంకన్న

గ్రామ సచివాలయం పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని స్వయంగా ఏపీ పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన మాట నిజం కాదా? అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. అవినీతి రాజకీయాల్లో ఆరితేరిన విజయసాయిరెడ్డికి నిరుద్యోగుల బాధ తెలియదని విమర్శించారు. పేపర్ లీక్ కారణంగా ఉద్యోగాలు సంపాదించిన వారికి విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ లీకులతో ధైర్యం చెబుతున్నారని దుయ్యబట్టారు. కానీ ఇలాంటి చర్యలతో విజయసాయిరెడ్డి 18 లక్షల మంది నిరుద్యోగులను అవమానిస్తున్నారని ట్విటర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

విజయసాయి రెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ … గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి జరిగిన పరీక్షల్లో స్కామ్ జరగలేదు అని ట్వీట్ పెట్టే దమ్ము ఉందా? పేపర్ లీక్ కాకపోతే రహస్య విచారణలు,ముఖ్యమంత్రి స్థాయిలో హడావిడి సమీక్షలు ఎందుకు పెడుతున్నారో చెప్పగలవా? అని ప్రశ్నించారు.   పరీక్ష రాసిన విద్యార్థులతో ఏవేవో ఆరోపణలు చేయించేందుకు చంద్రబాబు అనుకూల మీడియా ప్రయత్నించి విఫలమైందని సాయిరెడ్డి విమర్శించిన నేపథ్యంలో ఆయన ఈ విమర్శలు చేశారు.

Advertisements

 

error: నమస్కారం!