Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

ఏపీ పరిస్థితులు ఏం తెలుసునని కేసీఆర్ జోక్యం చేసుకుంటున్నారు? : చంద్రబాబు

కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంపై చంద్రబాబు స్పందించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తామని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని, అయినా ఏపీ పరిస్థితులు ఏం తెలుసునని కేసీఆర్ జోక్యం చేసుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పుడు తెలంగాణతో గొడవలు అవసరం లేదని ఆయన అన్నారు. గోదావరి ద్వారా శ్రీశైలంకు నీళ్లు తరలించాల్సిన అవసరం లేదని, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి గోదావరి-పెన్నా అనుసంధానం చేస్తే తక్కువ ఖర్చుతో నీళ్లు లభిస్తాయని చెప్పారు.

 

రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి ఆంధ్రుల మనోభావాలతో ఆడుకోవద్దని అన్నారు. నచ్చిన వాళ్లకు ప్రాజెక్టులు ఇచ్చేందుకు రాష్ట్రాన్ని లూటీ చేస్తారా? అని ఏపీ సీఎంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. నిపుణుల కంటే వైఎస్ జగన్ మేధావా? అని ధ్వజమెత్తారు. జగన్‌ హానెస్ట్‌ పర్సన్‌, నీతిమంతుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.రాష్ట్రాన్ని దోచుకోవటానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని విమర్శించారు. పోలవరం విషయంలో రాజీపడేది లేదని గట్టిగా పోరాడతామని చంద్రబాబు అన్నారు.

Read More
error: నమస్కారం!