Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

దూరతీరాలకు సాగిపోయిన బాల్య నేస్తమా.. అందుకో, నా ఈ కడసారి వీడ్కోలు : చంద్రబాబు భావోద్వేగం

చిత్తూరు మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ (68) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యతో కొన్నాళ్లుగా బాధపడుతున్న శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వారు లేనిలోటు పార్టీకి తీవ్రమైన బాధను మిగిల్చిందని చెప్పాలి. కాగా మాజీ ఎంపీ శివప్రసాద్ మరణంతో టీడీపీ అధినేత చంద్రబాబు చాలా భావోద్వేగానికి గురయ్యారు.

 

చిన్ననాటి స్నేహితుడు శివప్రసాద్ కు ఇదే చివరి వీడ్కోలు. నీతో గడిపిన బాల్య స్మృతులు మరువలేను. 6వ తరగతి నుంచి పదో తరగతి దాకా కలిసి చదువుకున్నాం. నువ్వు మెడిసిన్, నేను ఆర్ట్స్ అయినా, మళ్ళీ మనం జనం బాటలో కలిసాం. ప్రజాసేవలో కలిసి పనిచేశాం. నేను పిలిచానని సినీరంగం నుంచి రాజకీయాల్లోకొచ్చి నా వెంటే నిలబడ్డావ్. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా నీ సామర్ధ్యం రుజువు చేసుకున్నావు. సమైక్య రాష్ట్రం, ప్రత్యేకహోదాల కోసం ఢిల్లీలో నీ విలక్షణ పోరాటాన్ని ప్రజలు మరచిపోరు. దూరతీరాలకు సాగిపోయిన బాల్య నేస్తమా.. అందుకో, నా ఈ కడసారి వీడ్కోలు అంటూ భావోద్వేగభరితంగా వాఖ్యానించారు.

Advertisements

చిన్ననాటి స్నేహితుడు శివప్రసాద్ కు ఇదే చివరి వీడ్కోలు. నీతో గడిపిన బాల్య స్మృతులు మరువలేను. 6వ తరగతి నుంచి పదో తరగతి…

Posted by Nara Chandrababu Naidu on Sunday, September 22, 2019

error: నమస్కారం!