Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. శనివారం కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ సునీల్ అరోరా షెడ్యూల్‌ను ప్రకటించారు. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

 

ఈ ఎన్నికలకు సెప్టెంబర్ 27న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. అక్టోబరు 4న నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అక్టోబరు 5న నామినేషన్ల పరిశీలన, అక్టోబరు 7వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 24న రెండు రాష్ట్రాల ఫలితాలు ప్రకటించనున్నారు. మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Advertisements
error: నమస్కారం!