Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

సంక్రాంతి బరిలో కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’

118 తో హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం `శతమానం భవతి` దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం `ఎంతమంచివాడవురా`. గుజ‌రాతీ హిట్ చిత్రం ఆక్సీజ‌న్‌కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ కు జోడిగా మెహ‌రీన్ నటిస్తుంది. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన కల్యాణ్ రామ్ `సంక్రాంతికి థియేటర్లలో కలుస్తా’నని ట్వీట్ చేశాడు.

 

ఇప్పటికే సంక్రాంతి బరిలో మ‌హేష్ న‌టిస్తున్న ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ చిత్రంతో పాటు అల్లు అర్జున్ న‌టిస్తున్న అల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న ద‌ర్భార్ కూడా సంక్రాంతి బ‌రిలో నిలుస్తుంది.

Advertisements
error: నమస్కారం!