Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

Health Tips : కొబ్బ‌రిపాల‌తో అందం.. ఆరోగ్యం


కొబ్బరి పాలు ఆవుపాల కన్నా ఆరోగ్యకరమైనవని అధ్యయనాలు చెబుతున్నాయి. కొబ్బరిపాల వల్ల చాల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఆవు పాలతో పోలిస్తే ఇవి సులభంగా జీర్ణమవుతాయి. కొబ్బరి పాలల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. కొబ్బరికాయ తురుము నుండి వచ్చిన కొబ్బ‌రి పాలు ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌కరం. కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె, కొబ్బరి పాలు… ఇలా కొబ్బరి కాయలో ప్రతీదీ మనకు ఎంతో మేలు చేస్తుంది. కొబ్బ‌రి పాలు జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి బాగా సహకరిస్తుంది. ఎలాంటి ఆహారమైనా త్వరగా జీర్ణమవడానికి ఇవి తోడ్పడతాయి.

 

ఎండ ధాటికి కమిలి దెబ్బతిన్న చర్మంపై కొబ్బరిపాలలో ముంచిన దూదితో 5 నిమిషాలపాటు సున్నితంగా మర్దన చేయటం వల్ల కందిన, నల్లబడిన చర్మం సరికొత్త నిగారింపును సంతరించుకుంటుంది.

Advertisements

 

గోరువెచ్చని బకెట్టు స్నానపు నీటిలో అరకప్పు కొబ్బరి పాలు, గుప్పెడు గులాబీ రేకులు, చెంచా తేనె వేసి కలిపి ఆ నీటితో స్నానం చేస్తే చలి కారణంగా పొడిబారిన చర్మానికి తగినంత తేమ అంది చర్మం కాంతివంతం అవుతుంది.

 

చెమట ఎక్కువగా పోసి, దానికి కాలుష్యం, ధూళి ప్రభావం తోడైతే పలు వ్యర్ధాలు చర్మంపై పేరుకుపోయి మొటిమలు, కురుపులు ఏర్పడటం సహజమే. 10 చెంచాల కొబ్బరిపాలలో చెంచా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని పావుగంటపాటు అలాగే ఉంచి తర్వాత దూదితో ముఖమంతా అద్ది ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖం పై పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోయి చర్మం తాజాగా మారుతుంది.

 

అర కప్పు చిక్కని కొబ్బరి పాలలో చెంచా తేనె, 2 చెంచాల బియ్యపు రవ్వ, చెంచాబాదం నూనె కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు పట్టించాలి. 5 నిమిషాలపాటు మర్దనా చేసి ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగి మాయిశ్చరైజర్ రాస్తేపాదాలు మృదువుగా మారతాయి.

 

కప్పు కొబ్బరిపాలలో చెంచా నిమ్మరసం కలిపి 2 గంటలు ఫ్రిజ్‌లో 2-3 ఉంచి తీసి ఆమిశ్రమాన్ని మాడుకు పట్టించి వేడినీటిలో ముంచిన ఉన్ని టవల్‌ను తలకు చుట్టాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూ వాడి తలస్నానం చేయాలి. కనీసం వారానికి 2 సార్లు ఇలా చేయటం వల్ల వెంట్రుకలు రాలడం తగ్గటమే గాక జుట్టు మృదువుగా తయారవుతుంది.

 

చిట్లిన, పొడిబారిన జుట్టుకు కొబ్బరి పాలను బాగా పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేస్తుంటే జుట్టుకు తగినంత తేమ అంది పూర్వశోభను సంతరించునుకొంటుంది. జుట్టు కుదుళ్లు కూడా బలపడి జుట్టు రాలటం ఆగిపోతుంది.

error: నమస్కారం!