Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

Health Tips : జీలకర్రతో కడుపులో నులిపురుగులకు చెక్

ప‌లు ర‌కాల ప్ర‌త్యేక వంట‌కాల‌లో మ‌సాలా దినుసులు ఏవిధ‌మైన పాత్ర పోషిస్తాయో అంద‌రికీ తెలిసిందే. ఆ దినుసులు లేకుండా వంట‌కాల‌కు రుచి, వాస‌న రాదు. అలాంటి దినుసుల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి. దీన్ని చాలా వంట‌ల్లో వేస్తారు. అయితే ఇది వంట‌ల్లో రుచి, సువాస‌న‌ను మాత్ర‌మే కాదు, మ‌న‌కు ప‌లు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది.

 

కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. దీనిని తరచూ నమిలి రసం మింగుతుంటే కడుపులో ఉన్న నులిపురుగులను నివారించడమే కాదు, ఉదర సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయి. జీలకర్రను కషాయంగా కాచి తాగుతుంటే ఎలర్జీ వలన కలిగే బాధలు తగ్గుతాయి. నల్ల జీలకర్ర కషాయాన్ని సేవిస్తే షుగర్, బీ.పీ.ని అదుపులో ఉంచుతుంది.

Advertisements

 

నీళ్ళలో కొద్దిగా అల్లం వేసి బాగా వేడి చేయాలి. ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, గొంతు మంట, జలుబు, జ్వరం తగ్గుతాయి. కిడ్నీలకు రక్షణకల్పిస్తుంది. మూత్ర సంబంధ వ్యాధులను నయం చేస్తుంది.

 

జీలకర్రను దోరగా వేయించి అంతకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని చిన్న చిన్న మాత్రలు చేసుకొని రెండు పూటలా రెండు మాత్రలు చొప్పున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా, మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట పచ్చదనం తగ్గుతాయి. జీకలర్ర కిడ్నీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. జీలకర్రకు వేడిచేసే గుణం వుంది. అందుకే అతిగా మాత్రం తీసుకోరాదు.

 

రెండు టేబుల్ స్పూన్ల జీల‌క‌ర్ర‌ను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నాన‌బెట్టాలి. ఉదయాన్నే ప‌ర‌గ‌డుపున ఆ నీటిని తీసి మ‌రిగించి తాగాలి. అనంత‌రం నీటిలో నానిన ఆ జీల‌క‌ర్ర‌ను తినేయాలి. దీంతో నెల రోజుల్లోనే పొట్ట క‌రిగిపోతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

error: నమస్కారం!