Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

Gaganyaan : గగన్‌యాన్ ప్రయోగానికి సిద్ధమౌతున్న ఇస్రో

ISRO Next Target is Gaganyaan

ఇస్రో చంద్రయాన్ 2 తరువాత నెక్స్ట్ చేపట్టబోయే ప్రయోగంపై దృష్టి పెట్టింది. చంద్ర‌యాన్‌2 పూర్తిగా విజయవంతం కాకపోయినప్పటికీ ఆర్బిటార్ అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. ఆర్బిటార్‌లో ఉన్న మొత్తం 8 ప‌రిక‌రాలు కూడా మెరుగ్గా ప‌నిచేస్తున్నాయ‌న్నారు. విక్ర‌మ్ ల్యాండ‌ర్‌తో మాత్రం ఇంకా సంకేతాల‌ను అందుకోలేక‌పోయామ‌ని, దానికోసం ఇంకా ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. అండగా నిలిచిన భారతీయ పౌరులకు అయన ధన్యవాదాలు తెలియజేశారు.

 

2022లో గగన్‌యాన్ ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేయబోతున్నట్టు అయన పేర్కొన్నారు. 2022లో రోదసీలోకి గగన్‌యాన్ ప్రాజెక్ట్ ద్వారా వ్యోమగాములను పంపించబోతున్నామన్నారు. మరోవైపు గగనతలంపై ఉన్న పరిస్థితులను అధ్యాయనం చేసేందుకు వ్యోమగాములను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దీనికోసం ఎంపిక చేసిన కొంత మందికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. దీంట్లో చివరగా మిగిలిన నలుగురు వ్యోమగాములకు రష్యా స్పేస్ సెంటర్‌లో శిక్షణ ఇచ్చి గగనతలానికి పంపనున్నట్టు చెప్పారు. ఈ మిషన్ సక్సెస్ అయితే రోదసీలోకి వ్యోమగాములను సొంతంగా పంపిన నాలుగో దేశంగా ఇండియా నిలుస్తుందని అన్నారు.

Read More
error: నమస్కారం!