Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

మోహన్ లాల్ పై చార్జిషీట్ నమోదు చేసిన కేరళ అటవీ శాఖ

కేరళ అటవీశాఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పై చార్జిషీట్ నమోదు చేసింది. 2012లో మోహన్ లాల్ ఇంట్లో అక్రమంగా ఏనుగు దంతపు కళాఖండాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎర్నాకుళంలోని కోర్టులో చార్జిషీట్ దాఖలైంది. ఈయనపై కేస్ నమోదు చేసి కోర్టులో హాజరు పరచాలని చూస్తున్నారు అటవీ శాఖ అధికారులు. తాను కె కృష్ణన్‌ అయ్యర్‌ అనే వ్యక్తి నుంచి 65 వేలకు వీటిని కొనుగోలు చేశానని మోహన్‌లాల్ గ‌తంలో చెప్పారు.

 

ఈ క్రమంలో కేర‌ళ ప్ర‌భుత్వం స్పందించింది. ఏనుగు దంతపు కళాఖండాలను ఉంచుకునేందుకు మోహన్‌లాల్‌కు సరైన అనుమతి లేదని తేల్చేసింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఈయనకు ఎలాంటి అనువైన అనుమతి ఇవ్వలేదని కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో కేస్ మళ్లీ మొదటికి వచ్చేసింది. దాంతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 39 (3)తో మోహన్‌లాల్‌పై నేరం రుజువు చేయొచ్చని హైకోర్టు తేల్చడం సంచలనంగా మారింది. సూపర్ స్టార్ కావడంతో ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాల్సిందిగా పిటిషనర్‌ హైకోర్టును కోరాడు. అప్పట్లో మోహన్ లాల్ ఇంట్లో సోదాలు చేసినపుడు కూడా ఐటీ అధికారులు ఆ దంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈయనపై కేస్ నమోదు చేసి కోర్టులో హాజరు పరచాలని అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Read More
error: నమస్కారం!