Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

నటుడు, తెదేపా మాజీ ఎంపీ శివప్రసాద్‌ కన్నుమూత

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత, సినీ నటుడు నారమల్లి శివప్రసాద్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్‌ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. శివప్రసాద్‌ 1951 జులై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో జన్మించారు. చంద్రబాబు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన శివప్రసాద్ గారు 1999లో శాసన సభ్యులుగా ఎన్నికై 2001 వరకు రాష్ట్ర సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2009, 2014లో చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి తెదేపా తరఫున ఆయన విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు.

 

స్వతహాగా నటుడైన శివప్రసాద్ తన నిరసనలను కూడా అదే రీతిలో తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ.. రకరకాల వేషధారణల్లో నిరసనలు తెలిపేవారు. దీంతో ఓ దశలో ఆయన జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు.

Advertisements
error: నమస్కారం!