Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయం రద్దు.. ప్రభుత్వమే సినిమా టికెట్లను విక్రయిస్తుంది ?

 

సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించే విధానానికి స్వస్తి చెప్పబోతున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు మంత్రి  తన అభిప్రాయాన్ని ప్రకటించారు. ప్రభుత్వమే నేరుగా టికెట్లను విక్రయిస్తే అందరికీ లాభముంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త విధానం వల్ల నిర్మాతలకు, పంపిణీదారులకు ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. కుటుంబాలతో సంబంధం లేకుండా ప్రతిభావంతులే హీరోలవుతారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రేస్‌కోర్స్ ట్యాక్స్‌పై స్పెషల్ డ్రైవ్ చేశామనీ, గతంలో లక్షల్లో కట్టే పన్ను ఇపుడు కోట్లల్లో కడుతున్నారనీ, ఇలాంటి వ్యవస్థను పూర్తిగా మారుస్తామని ఆయన అన్నారు.

error: నమస్కారం!