Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

Chandrayaan 2 : దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఇస్రో

చంద్రుడిపైకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2తో చివరినిమిషంలో సంబంధాలు తెగిపోవడంతో శాస్త్రవేత్తలతో పాటు దేశ ప్రజలు కూడా కాస్త నిరాశకు గురయ్యారు. అయితే ఆ సమయంలో ఇస్రోకు దేశ ప్రజల మద్దతు సంపూర్ణంగా లభించింది. చివరినిమిషంలో విక్రమ్ ల్యాండర్ ట్రాక్ తప్పడం ఆ తర్వాత భూమిపై ఉన్న ఇస్రో స్టేషన్‌కు సంకేతాలు అందకపోవడంతో శాస్త్రవేత్తలు నిరాశకు లోనయ్యారు. ఇస్రోతో కమ్యూనికేషన్ కట్ అయ్యింది. దీంతో ల్యాండర్ నుంచి రోవర్ బయటకు రాలేకపోయింది. ఈ రెండింటి కాల పరిమితి 14 రోజులు. ఈ రెండు వారాలు సిగ్నల్స్ కోసం శతవిధాలా ప్రయత్నించింది ఇస్రో. నాసా సాయం కూడా తీసుకుంది. అయినా ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించలేకపోయారు.

 

విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయన తర్వాత భారత ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు కూడా తమకు మద్దతుగా నిలిచి శాస్త్రవేత్తల్లో ధైర్యం నింపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇస్రో ట్వీట్ చేసింది. ‘మాకు మద్దతుగా నిలిచినందుకు భారతీయులందరికీ ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలు, కలల స్ఫూర్తితో మేము మరింత ముందుకు సాగుతాం’ అని ఇస్రో ట్వీట్‌లో పేర్కొంది.

Read More

error: నమస్కారం!