Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

దోమలు కొందరినే ఎక్కువగా ఎందుకు కుడతాయో తెలుసా ?

 

అసలు దోమలు కొందరినే ఎందుకు కుడతాయి, ఎక్కువగా ఎందుకు వారినే విసిగిస్తాయి. అసలు ఎలాంటి వారిని దోమలు ఖచ్చితంగా టార్గెట్‌ చేస్తాయి అనేదానికి శాస్త్రీయమైన కారణాలున్నాయంటున్నారు పరిశోధకులు. చర్మం నుంచి వెలువడే రసాయనాలు, చర్మంపై ఉండే బ్యాక్టీరియాకు దోమలు అట్రాక్ట్‌ అవుతాయి. అందుకే దోమలు పదేపదే కుడుతుంటాయి. దోమలు కుట్టడానికి బయలాజికల్‌ ఫ్యాక్టర్స్‌ ఉన్నాయని అమెరికన్‌ మస్కిటో కంట్రోల్‌ అసోసియేషన్‌ టెక్నికల్‌ అడ్వైజర్‌, ఎంటమాలజిస్ట్‌ జోసెఫ్‌.ఎమ్‌. కాలన్‌ చెబుతున్నారు.

 

ప్రెగ్నెన్సీ : సాధారణంగా ఆడదోమలు కార్బన్‌డయాక్సైడ్‌ ఉండే వాతావరణాన్నే ఇష్టపడతాయని 2002 సంవత్సరంలోని ఓ రీసెర్చ్‌ ద్వారా తెలిసింది. ముఖ్యంగా గర్భిణులను దోమలు కుట్టడానికి ఇష్టపడతాయి. సాధారణ మహిళలకంటే గర్భిణులు (28 వారాల సమయంలో) విడిచే శ్వాసలో 21 శాతం కంటే ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ ఉంటుంది. అందుకే దోమలు గర్భిణులను కుడతాయని కార్నెల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ లారా చెబుతున్నారు.

Advertisements

 

డ్రెస్ : దోమలకు ఉదయం పెద్దగా కళ్లు కనిపించవు. మధ్యాహ్నం నుంచీ వాటి చూపు బెటర్ అవుతుంది. సాయంత్రం, రాత్రి అయ్యే కొద్దీ వాటి కళ్లు బాగా కనిపిస్తాయి. అయితే ఇంట్లోకి రాగానే అవి డార్క్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నవాళ్లకు ఎట్రాక్ట్ అవుతాయి.

 

చెమట : శారీరకంగా కష్టపడినప్పుడు లాక్టిక్‌ ఆవ్లుం, యూరిక్‌ ఆవ్లుం, అమ్మోనియా వంటి రసాయనాలు మన చర్మం నుంచి విడుదలవుతాయి. అందుకే చెమట పట్టిన శరీరమంటే దోమలు కుట్టడానికి బాగా ఇష్టపడతాయి.

 

బ్లడ్గ్రూప్ : ‘ఓ’ గ్రూప్‌ రక్తాన్ని దోమలు రెండు రెట్లు అధికంగా ఇష్టపడతాయట. మగదోమలు పూలు, తేనెపై ఆధారపడితే ఆడదోమలు మనుషుల రక్తాన్ని తాగటానికి ఇష్టపడతాయి. మొత్తానికి రక్తదాతలపై మాత్రం దోమల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

 

కోర్బన్డయాక్సైడ్ : దోమలు కార్బన్‌డయాక్సైడ్‌ను 160 మీటర్ల దూరంలో ఉన్నా పసిగడతాయి. వెంటనే అక్కడ వాలిపోయి, మనం నిద్రపోయే సమయంలో ముక్కు, నోటి నుంచి కార్బన్‌డయాక్సైడ్‌ ఎక్కువ శాతంలో విడుదలవుతుంది. దీనికి అట్రాక్ట్‌ కావటం వల్లే మనం నిద్రపోయే సమయంలో తలచుట్టూ శబ్దం చేస్తూ తిరుగుతుంటాయి.
ఇలా దోమలు కుట్టడానికి ప్రదేశాలను ఎంచుకునే కుడతాయనేది పరిశోధనల ద్వారా ప్రొఫెసర్లు వెల్లడిస్తున్నారు.

error: నమస్కారం!